స్టాక్ మార్కెట్లు అతిస్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల బాట పట్టిన మార్కెట్లు చివరి సెషన్లో పట్టు కోల్పోయాయి. 52.16 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 37,402 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 6.10 పాయింట్లు లాభపడి 11,053 వద్ద ముగిసింది.
పలు రంగాల్లో వృద్ధి మందగమనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్త పడ్డారు. చివరి గంటలో అమ్మకాలకు మొగ్గుచూపటం వల్ల మార్కెట్లు లాభాలు కోల్పోయాయి. షాడో బ్యాంకుల అంశంలో సమీక్షలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నిర్ణయం వెలువడిన తర్వాత బ్యాంకింగ్ షేర్లు పడిపోయాయి.
మార్కెట్లకు రిలయన్స్ భరోసా
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో పాటు రిలయన్స్, ఐసీఐసీఐ షేర్ల కొనుగోలుతో ఉదయం సూచీలు ఉత్సాహంగా సాగాయి మార్కెట్లు. ఒకానొక దశలో సెన్సెక్స్ 369 పాయింట్లు మెరుగుపడింది. నిఫ్టీ 11,100 మార్కుపైనే ట్రేడయింది.
యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, మహింద్రా అండ్ మహింద్రా, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ పవర్ గ్రిడ్ 3.46 శాతం నష్టపోయాయి. సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, విప్రో 2.66 శాతం లాభపడ్డాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.46గా కొనసాగుతోంది. బ్యారెల్ ముడిచమురు ధర 58.97 డాలర్లు ఉంది.
ఇదీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్‌కు తాళం వేయండిక!