ETV Bharat / business

బుల్ జోరు- 47 వేలకు చేరువలో సెన్సెక్స్​ - bajaj twins

అంతర్జాతీయ సానుకూలతల నడుమ దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 400, నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పెరిగి.. జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి.

STOCK MARKETS CLOSE
జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు
author img

By

Published : Dec 16, 2020, 3:42 PM IST

స్టాక్​మార్కెట్లు ఇవాళ లాభాల్లో దూసుకెళ్లాయి. సూచీలు రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకాయి. బ్యాంకింగ్​, స్థిరాస్తి, లోహ రంగం షేర్ల దూకుడుతో మదుపర్ల సెంటిమెంట్​ బలపడింది. కరోనా టీకాపై ఆశలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ ఒక దశలో 440 పాయింట్లకుపైగా పెరిగి.. 46 వేల 705 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. సెషన్​ చివరకు 403 పాయింట్ల లాభంతో.. 46 వేల 666 వద్ద ముగిసింది.

నిఫ్టీ 115 పాయింట్లు పెరిగింది. 13 వేల 63 వద్ద సెషన్​ను ముగించింది.

మొత్తం 1801 షేర్లు లాభపడ్డాయి. 1129 షేర్లు క్షీణించాయి. 164 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివివే..

హెచ్​డీఎఫ్​సీ, హిందాల్కో, దివీస్​ ల్యాబ్స్​, ఓఎన్​జీసీ, టైటాన్​ కంపెనీ రాణించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, గెయిల్​, టెక్​ మహీంద్రా డీలాపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.