Share Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో చివర వరకు జోరు కనబరిచాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ-సెన్సెక్స్ 385 పాయింట్లు వృద్ధి చెంది.. 57,315 వద్ద సెషన్‌ను ముగించింది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి.. 17,072 వద్ద స్థిరపడింది.
దాదాపు అన్నిరంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా.. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, స్థిరాస్తి రంగాల షేర్లు 1-2శాతం మేర లాభాలు గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
ఉదయం 57,251 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 57,490 తాకింది. ఒకదశలో 57,146 అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 17,118 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,015 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
Stock Market Top Gainers: పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టైటాన్, టెక్‌మహీంద్రా, బజాజ్ఫిన్సెర్వ్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Stock Market Top Losers:
భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ కొనుగోళ్లకు కార్డుపై నంబర్లన్నీ ప్రతిసారీ ఎంటర్ చేయాల్సిందేనా?