stock market updates: వరుసగా మూడు రోజులు భారీ లాభాలు ఆర్జించిన స్టాక్ మార్కెట్లు.. వారాంతంలో డీలా పడ్డాయి. దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 191 పాయింట్లు పతనమై.. 57,124 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 69 పాయింట్ల నష్టంతో 17,003 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా...
BSE Sensex: ఉదయం 57,567 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్.. 56,813 కనిష్ఠాన్ని తాకింది. తిరిగి పుంజుకుని 57,623 గరిష్ఠాన్ని చేరుకుంది.
NSE Nifty :17,149 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ.. 17,155 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి నష్టాల్లోకి జారుకుంది. 16,909 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభా నష్టాల్లోని ఇవే..
- హెచ్‌సీఎల్‌టెక్, టెక్‌మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.
- ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, కొటక్ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ఫిన్సెర్వ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎప్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇదీ చూడండి: మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇలా చేయండి