స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్(Sensex today) 189 పాయింట్లు తగ్గి 52,735 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 45 పాయింట్ల నష్టంతో 15,814 వద్దకు చేరింది.
ఐటీ, హెవీవెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైనందువల్ల స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 53,126 పాయింట్ల అత్యధిక స్థాయి.. 52,673 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,915 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,792 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్, డా.రెడ్డీస్, టెక్‌మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
టీసీఎస్, టైటాన్, హెచ్‌సీఎల్, రిలయన్స్, బజాజ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఇదీ చదవండి: తొలి రోజు ట్రేడింగ్‌లో కిమ్స్, దొడ్ల డెయిరీ అదరహో..!