ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: వరుసగా మూడో రోజు నష్టాలు - స్టాక్​ మార్కెట్​ వార్తలు

కరోనా వైరస్​ భయాలతో వరుసగా మూడో రోజు స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 82, నిఫ్టీ 16 పాయింట్ల నష్టపోయాయి.

stock market
స్టాక్ మార్కెట్
author img

By

Published : Feb 25, 2020, 3:47 PM IST

Updated : Mar 2, 2020, 12:56 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు మూడో సెషన్​లో స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 82 పాయింట్లు కోల్పోయి 40,281 వద్ద స్థిరపడింది. 31.5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,798 పాయింట్లకు చేరింది.

లాభనష్టాల్లో..

టీసీఎస్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, హిందుస్థాన్​ యూనిలీవర్​ షేర్లు లాభపడ్డాయి.

డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, గెయిల్​, సన్​ ఫార్మా, ఐషర్ మోటార్స్​, రిలయన్స్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టపోయాయి.

సెబీ నిర్ణయమే కారణం!

చైనా వెలువల పలు దేశాల్లో కరోనా వైరస్​ కేసుల సంఖ్య పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మారిషస్​​పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయంతో నిన్న మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం నేడూ కొనసాగింది.

మారిషస్​ను ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే లిస్ట్​లో చేర్చుతారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఆ దేశానికి నుంచి పెట్టుబడులు స్వీకరణను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది సెబీ.

ఆసియాలో మిశ్రమం..

ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. దక్షిణ కొరియా, హాంకాంగ్​ లాభాల బాట పట్టగా.. చైనా, జపాన్​ నష్టపోయాయి.

Last Updated : Mar 2, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.