స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఉద్యోగాల సృష్టికి మద్దతుగా బడ్జెట్‌లో మౌలిక రంగ వ్యయాలను భారీగా పెంచడం, కొత్తగా పన్నులు విధించకపోవడంతో మదుపర్లపై కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపర్చాయి. దీంతో భారీ లాభాల దిశగా మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.
లాభనష్టాలు..
బజాజ్ ఫినాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్రా, నేస్లే, మారుతీ, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.