ETV Bharat / business

Stock Market: మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 656 పాయింట్లు పతనం - స్టాక్​ మార్కెట్​

stock market live updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jan 19, 2022, 9:46 AM IST

Updated : Jan 19, 2022, 4:04 PM IST

16:03 January 19

స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాల మదుపర్లను ప్రభావితం చేశాయి. ఫలితంగా బీఎస్​ఈ సెన్సెక్స్​ 656 పాయింట్లు కోల్పోయి 60,099కి పడిపోయింది. నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.

11:48 January 19

భారీ నష్టాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి.

దీనికి తోడు అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోవైపు చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ ప్రతికూల పరిణామాలతో భారీ నష్టాల వైపు సూచీలు అడుగులు వేస్తున్నాయి.

మరోవైపు మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ సానుకూలంగా ఉండడం, ప్రీ-బడ్జెట్‌ ఆశలు.. నష్టాల్ని కట్టడి చేసే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం బీఎస్​ఈ సెన్సెక్స్​ 435 పాయింట్లు కోల్పోయి 60,310 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 125 పాయింట్లు నష్టంతో 17,987 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు ఇలా..

టాటా స్టీల్​, మారుతీ, మహీంద్రా అండ్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫినాన్స్​, ఇన్ఫోసిస్​, హిందుస్థాన్​ యూనీలివర్​ విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:45 January 19

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 474 పాయింట్లు నష్టపోయి 60,339కి చేరింది. నిఫ్టీ 134 పాయింట్ల పతనంతో 17,978 వద్ద ట్రేడవుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​, పవర్​ గ్రిడ్​ మినహా.. మిగతా అన్నీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 19, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.