ETV Bharat / business

ఆశల పల్లకిలో మదుపర్లు- మార్కెట్లకు లాభాలు

stock market live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​
author img

By

Published : Jan 11, 2022, 9:11 AM IST

Updated : Jan 11, 2022, 3:43 PM IST

15:42 January 11

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్​ను తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభించిన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 221 పాయింట్లు పెరిగి 60,617 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 18,055 వద్ద స్థిరపడింది.

త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశల మధ్య ఐటీ, ఆర్థిక షేర్ల కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపడం లాభాలకు కారణమైంది.

14:23 January 11

స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం సెషన్​ స్తబ్దుగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత తేరుకుని పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 254 పాయింట్లు లాభపడి 60,649కి చేరింది. నిఫ్టీ 60 పాయింట్లు వృద్ధి చెంది 18,063 వద్ద ట్రేడవుతోంది.

09:53 January 11

ఉదయం నుంచి ఒడుదొడుకుల మధ్య కదలాడుతున్న స్టాక్​ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్​ 137 పాయింట్లు వృద్ధి చెంది 60,533కి చేరింది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 18,028 వద్ద ట్రేడవుతోంది.

హెచ్​సీఎల్ టెక్​, హెచ్​డీఎఫ్​సీ, దివీస్ ల్యాబ్స్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్, బజాజ్​ ఫైనాన్స్​, ఏషియన్​ పెయింట్స్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

08:44 January 11

stock market live updates

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో సెన్సెక్స్​ స్వల్పంగా 50కిపైగా పాయింట్లు కోల్పోయి 60,338కి చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 5 పాయింట్లు క్షీణించి 17,997వద్ద కదలాడుతోంది.

Last Updated : Jan 11, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.