ETV Bharat / business

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు​ - Nifty today

Stock Market LIVE Updates
Stock Market LIVE Updates
author img

By

Published : Dec 23, 2021, 9:33 AM IST

Updated : Dec 23, 2021, 3:59 PM IST

15:55 December 23

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో చివర వరకు జోరు కనబరిచాయి. సెన్సెక్స్​ 385 పాయింట్లు లాభపడి.. 57,315 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి.. 17,072 వద్ద స్థిరపడింది.

12:32 December 23

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,390 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 125 పాయింట్లు వృద్ధి చెంది.. 17,080 వద్ద కొనసాగుతోంది.

11:16 December 23

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. దీంతో సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా లాభంతో.. 57,187 వద్ద ట్రేడవుతోంది.

మరో సూచీ నిఫ్టీ 71 పాయింట్లు వృద్ధి చెంది.. 17,027 వద్ద కదలాడుతోంది.

భారతీఎయిర్​టెల్​, ఏషియన్​పెయింట్​, అల్ట్రాటెక్​సిమెంట్​, మారుతీ, సన్​ఫార్మా, ఐసీఐసీఐబ్యాంకు, హెచ్​సీఎల్​టెక్​ ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:04 December 23

స్టాక్​ మార్కెట్​ లైవ్ అప్​డేట్స్​

Stock Market LIVE Updates: వరుసగా మూడోరోజూ బుల్​జోరు కొనసాగిస్తోంది. ఫలితంగా దేశీయ స్టాక్​మార్కెట్లు​ గురువారం సెషన్​ను లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతుండటం ఇందుకు కలిసొస్తోంది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,239 వద్ద కదలాడుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి.. మళ్లీ 17 వేల మార్కును అందుకుంది.​

  • ముప్పై షేర్లు ఇండెక్స్​లో ఏషియన్​పెయింట్స్, భారతీఎయిర్​టెల్​​ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 23, 2021, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.