ETV Bharat / business

Stock market: స్టాక్​ ​మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్ 600 డౌన్​ - షేర్ మార్కెట్ అప్డేట్స్

Stock market live
స్టాక్​ మార్కెట్ లైవ్​
author img

By

Published : Dec 17, 2021, 9:31 AM IST

Updated : Dec 17, 2021, 1:13 PM IST

13:07 December 17

నష్టాల్లోనే సూచీలు

స్టాక్​మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. వీటితో పాటు ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్​ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడితో డీలా పడ్డాయి. ఫలితంగా సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

బీఎస్​ఈ-సెన్సెక్స్​ 600 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 57,254 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 198 పాయింట్లు పతనమై.. 17,050 వద్ద కదలాడుతోంది.

  • సెన్సెక్స్​ 30 సూచీలో ఇన్ఫోసిస్​, హెసీఎల్​టెక్​, టీసీఎస్​, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​ మినహా మిగిలినవి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

10:15 December 17

దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 600 పాయింట్లకుపైగా కోల్పోయి.. 57,298 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 193 పాయింట్లు పతనమై.. 17,055 వద్ద కొనసాగుతోంది.

ఐటీ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

కారణాలివే..!

  • అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి.
  • నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
  • దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది.
  • ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతోంది.
  • అమెరికా ఫెడ్‌ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం.

ఈ పరిణామాల నేపథ్యంలోనే మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు డీలా పడ్డాయి.

09:02 December 17

స్టాక్​ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు వారాంతం సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. ఒమిక్రాన్​ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 200 పాయింట్లు నష్టపోయి.. 57,700 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 78 పాయింట్లు కోల్పోయి.. 17,169 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​టెక్​, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, ఎన్​టీపీసీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Dec 17, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.