స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 163 పాయింట్లు తగ్గి 55,629 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 16,568 వద్ద ముగిసింది.
- అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం సానుకూలంగా ముగిశాయి.