ETV Bharat / business

ఆద్యంతం ఒడుదొడుకులు.. చివరికి స్వల్ప లాభాలు

stock market
మార్కెట్లు
author img

By

Published : Sep 7, 2020, 9:37 AM IST

Updated : Sep 7, 2020, 3:49 PM IST

15:45 September 07

స్వల్ప లాభాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వాహన, బ్యాంక్​ రంగాల్లో ఒత్తిళ్లతో ఒడుదొడుకులకు గురైన దేశీయ సూచీలు.. ఎఫ్​ఎమ్​జీసీ, ఐటీ షేర్ల దూకుడుతో చివిరి నిమిషంలో లాభాలను నమోదు చేశాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 60 పాయింట్లు వృద్ధి చెంది 38,417 వద్ద స్థిరపడింది. 21 పాయింట్లు మెరుగుపడిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,355కు చేరింది.

లాభానష్టాలు...

టీసీఎస్​, ఐటీసీ, ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్​, రిలయన్స్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, టైటాన్​, టాటాస్టీల్​, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఎం అండ్​ ఎం​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టెక్​ఎమ్​, హెచ్​డీఎప్​సీ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, ఓన్​జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:20 September 07

ఊసిగలాటలో మార్కెట్ సూచీలు..

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా సూచీలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.  

మిడ్ సెషన్​ సమయానికి.. సెన్సెక్స్​ 23 పాయింట్ల నష్టంతో 38,334 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్ల కోల్పోయి 11,322 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

మహీంద్రా అండ్​ మహీంద్రా 4 శాతం మేర నష్టపోగా... ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎల్​ అండ్​ టీ షేర్లు వెనకబడ్డాయి.  

హిందుస్థాన్​ యూనిలివర్, టీసీఎస్​, టైటాన్​, నెస్లే, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

10:18 September 07

ఒడుదొడుకుల్లో..

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 38 పాయింట్ల కోల్పోయి 38,318 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 11,313 వద్ద కొనసాగుతోంది.

లాభ నష్టాల్లో..

యాక్సిస్​ బ్యాంక్, మారుతి, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, హిందుస్థాన్​ యూనిలివర్, టీసీఎస్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్​టెల్​, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​సీఎల్​ టెక్, బజాజ్​ ఫినాన్స్​ నష్టాల్లో ఉన్నాయి.  

ఆసియా మార్కెట్లు..

హాంకాంగ్​, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతండగా.. షాంఘై, జపాన్​ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  

బ్రెంట్​ చమురు ధర  స్వల్పంగా తగ్గి బ్యారెల్​కు 42.26 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

09:29 September 07

అంతర్జాతీయ ప్రతికూలతలతో నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 38,255 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11,308 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Sep 7, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.