మార్కెట్లకు మళ్లీ నష్టాలు..
ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 380 పాయింట్లకుపైగా నష్టంతో.. 55 వేల 80 ఎగువన ట్రేడవుతోంది.
నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 480 వద్ద ఉంది.
ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకుపైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
లాభనష్టాల్లో..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ రాణిస్తున్నాయి.
అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డీలాపడ్డాయి.