ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 135 డౌన్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Jul 28, 2021, 9:32 AM IST

Updated : Jul 28, 2021, 3:42 PM IST

15:38 July 28

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు కోల్పోయి 52,443 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 15,709 వద్దకు చేరింది.

  • భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, ఎం&ఎం, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ ఎక్కువగా నష్టపోయాయి.

14:49 July 28

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్ 290 పాయింట్లకుపైగా కోల్పోయి.. 52,285 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టంతో 15,664 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్​, బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్​యూఎల్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం&ఎం, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10:45 July 28

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 670 పాయింట్లకుపైగా కోల్పోయి.. 51,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 210 పాయింట్లకుపైగా నష్టంతో 15,532 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • హెచ్​యూఎల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్, టైటాన్​ మినహా.. 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, ఎల్​&టీ, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:13 July 28

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 260 పాయింట్లకుపైగా కోల్పోయి 52,310 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 80 పాయింట్లకుపైగా నష్టంతో 15,666 వద్ద కొనసాగుతోంది.

ఎఫ్​ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో నమోదవుతున్న అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​, సన్​ఫార్మా షేర్లు కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి.
  • నెస్లే, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టీసీఎస్​ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jul 28, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.