ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 152 ప్లస్​ - stocks

stock market live updates
స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Aug 10, 2021, 9:35 AM IST

Updated : Aug 10, 2021, 3:47 PM IST

15:42 August 10

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు పెరిగి 54,555 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 16,280 వద్దకు చేరింది.

మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్​. టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విద్యుత్​, లోహ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. 

  • భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​, ఎం&ఎం లాభాలను గడించాయి.
  • టాటా స్టీల్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, బజాజ్ ఆటో నష్టాలను నమోదు చేశాయి.

11:10 August 10

స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ మరోసారి బీఎస్​ఈ-సెన్సెక్స్​  జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా దిగ్గజ కంపెనీల్లో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో బీఎస్​ఈ సెన్సెక్స్​ 292 పాయింట్లు లాభంతో 54,694 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 72 పాయింట్లు ఎగబాకి 16,331 వద్ద ట్రేడవుతోంది. 

30షేర్ల ఇండెక్స్​లో టెక్​ మహీంద్రా టాప్​లో కొనసాగుతుండగా... పవర్​గ్రిడ్​ చివర్లో ఉంది.

09:11 August 10

స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 189 పాయింట్ల లాభంతో 54,592 కి చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 47 పాయింట్లు బలపడి 16,305 వద్ద కొనసాగుతుంది. 

లాభనష్టాలు....

కోటక్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ, టైటాన్​, బజాజ్​ ఫినాన్స్​, మహీంద్ర అండ్​ మహీంద్ర, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

పవర్​గ్రిడ్​, నెస్లే, బజాజ్​ ఆటో, హిందుస్థాన్​ యూనిలివర్​, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated : Aug 10, 2021, 3:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.