అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో.. 58,240 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి.. 17,340 వద్ద ట్రేడవుతోంది.
కొన్ని వారాలుగా మార్కెట్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నప్పటీకీ లాభాల స్వీకరణతో ఆర్థిక షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురై సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.
- యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
- నెస్లే, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.