స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్లు పెరిగి 31,589 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 9,267 వద్ద ముగిసింది.
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన చర్యలు మదుపర్లలో భరోసా నింపడం నేటి లాభాలకు ప్రధాన కారణం.