ETV Bharat / business

ఆటో, లోహ షేర్లు డీలా.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - షేర్ మార్కెట్ అప్డేట్స్

Stock market live
స్టాక్​ మార్కెట్ల లైవ్​
author img

By

Published : Nov 30, 2021, 9:30 AM IST

Updated : Nov 30, 2021, 3:49 PM IST

15:39 November 30

స్టాక్ మార్కెట్​లు మంగళవారం సెషన్​లో నష్టాలపాలయ్యాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు పతనమైంది. చివరకు 57,065 వద్ద స్థిరపడింది.

అటు, నిఫ్టీ సైతం నష్టాల బాటలోనే పయనించింది. 71 పాయింట్లు కోల్పోయి.. 16,983 వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఆటో, లోహ షేర్లు డీలా పడటం వల్ల సూచీలు బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

11:37 November 30

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో సెన్సెక్స్​ 900 పాయింట్లకుపైగా పెరిగింది.

ప్రస్తుతం 150 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 100 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి.. 17 వేల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫినాన్స్​ లాభాల్లో ఉన్నాయి.

కోటక్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​, టాటా స్టీల్​, హీరో మోటోకార్ప్​, కోల్​ ఇండియా డీలాపడ్డాయి.

10:33 November 30

బుల్​ జోరు..

దేశీయ స్టాక్​ మార్కెట్లలో బుల్​ గేరు మార్చింది. అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకు, ఆయిల్​ అండ్​ గ్యాస్​, పవర్​, స్థిరాస్తి రంగాల షేర్లు 1 నుంచి 3 శాతం పెరిగాయి. బీఎస్​సీ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ సూచీలు 1 శాతం పైకి వృద్ధి చెందాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం.. డాలర్​తో పోల్చితే రూపాయి విలువ 18 మెరుగై రూ.74.91 వద్ద ప్రారంభమవడం సానుకూల అంశాలు. దీంతో పాటు దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీ తగ్గడం వల్ల.. షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

మరోవైపు ఫ్యాషన్​ సంస్థ గోకలర్స్.. స్టాక్‌ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. ఈ సంస్థ షేర్లు 91 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి. ప్రముఖ ఇన్సూరెన్స్​ సంస్థ స్టార్​ హెల్త్​ ఐపీఓ మంగళవారం సబ్​స్క్రిప్షన్​కు రానుంది. ఈ అనుకూల పరిణామాల నేపథ్యంలో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 889 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 58,150 వద్ద కదలాడుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 260 పాయింట్ల లాభంతో.. 17,314 వద్ద ట్రేడవుతోంది.

08:42 November 30

స్టాక్​ మార్కెట్ల లైవ్​

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 400 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,711 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 122 పాయింట్లు లాభంతో.. 17,176 వద్ద కొనసాగుతోంది.

  • సెన్సెక్స్​ 30 సూచీలో ఎం అండ్​ ఎం, డాక్టర్ రెడ్డీస్​ షేర్లు మినహా మిగిలినవి లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 30, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.