ETV Bharat / business

మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 230 ప్లస్ - stock market news in telugu

బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన మార్కెట్​ క్రమంగా కోలుకుని లాభాలబాట పట్టింది. ఐటీ, ఆటో మినహా ఇతర కీలక రంగాల షేర్లు కోలుకున్నాయి.

stock market live today, bse sensex today
నష్టాలతో ప్రారంభమై చివరికి లాభాలతో..
author img

By

Published : Jun 21, 2021, 3:44 PM IST

Updated : Jun 21, 2021, 4:23 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 52,574 ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 15,746 వద్ద స్థిరపడింది.

ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు​ క్రమంగా పుంజుకుని లాభాల బాట పట్టాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు సహా రిలయన్స్​ ఇండస్ట్రీస్​​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు సూచీలు​ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఆటో, ఐటీ మినహా ఇతర కీలక రంగాలు కోలుకోవడం మార్కెట్​ను లాభాలబాట పట్టేలా చేశాయి. స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​ షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి కనబరిచారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,629 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 51,740 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,765 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 15,505 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

అదానీపోర్ట్స్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫిన్​సర్వ్​​, టైటాన్​, ఎస్​బీఐఎన్​ లాభాలను గడించాయి.

యూపీఎల్​, విప్రో, టాటా మోటార్స్​, మారుతీ, టెక్​ మహీంద్రా​ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Last Updated : Jun 21, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.