స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సోమవారం కుప్పకూలిన సూచీలు తాజా సెషన్లో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1736 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 58,142 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం భారీ లాభాలను నమోదు చేసింది. 509 పాయింట్లు ఎగబాకింది. చివరకు 17,352 వద్ద ట్రేడింగ్ ముగించింది.
సైన్యాన్ని వెనక్కి పిలవాలని రష్యా తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాన్ని పంపింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం త్వరలోనే తొలగిపోతుందన్న ఆశలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. వీటితో పాటు వివిధ రంగాల షేర్లన్నీ రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.