ETV Bharat / business

రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్​బాత్ - స్టాక్​ మార్కెట్​

Stock Market Live News Updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Feb 14, 2022, 9:26 AM IST

Updated : Feb 14, 2022, 3:41 PM IST

15:39 February 14

ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం, చమురు ధరల మంట, అమెరికా ద్రవ్యోల్బం.. వంటి కారణాలతో దేశీయ సూచీలన్నీ విలవిల్లాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 1747 పాయింట్లు నష్టపోయింది. చివరకు 56,405 వద్ద స్థిరపడింది.

అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం కుప్పకూలింది. 532 పాయింట్లు పతనమైంది. చివరకు 16,842 వద్ద ముగిసింది.

15:05 February 14

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 1740 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 56,408 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ 500 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 16,875 వద్ద కొనసాగుతోంది.

14:10 February 14

స్టాక్స్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు భారీ స్థాయిలో అమ్మకాలకు కారణమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1,433 పాయింట్లకుపైగా నష్టంతో.. 56,719 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 434 పాయింట్లు కోల్పోయి.. 16,940 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ఉక్రెయిన్ ఆక్రమణకు ఆ దేశ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. మరోవైపు ఇందుకు వ్యతిరేకంగా అమెరికా రంగంలోకి దిగి పుతిన్​ను హెచ్చరించడం మరింత హీటును రాజేసింది. ఈ పరిణామాలు కచ్చితంగా అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతాయని వార్తలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి.

మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను ఏ స్థాయిలో, ఎప్పుడు పెంచుతారనే అంశాలపై కూడా మదుపరులు దృష్టి సారించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ జనవరి సమావేశ ముఖ్యాంశాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ప్రారంభం నుంచి సూచీలు ఎర్ర రంగు పులుముకున్నాయి.

దేశీయంగా జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణం గత నెలతో పోల్చితే తగ్గినా... ఆశించిన స్థాయిలో లేకపోవడం మదుపరులను నిరాశపరిచింది. దీంతో ఎఫ్​ఎంజీసీ స్టాక్స్​ కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపింది.

స్టాక్​ మార్కెట్​లో బడా షేర్లు కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఇది కూడా అమ్మకాలను ప్రోత్సహిస్తోంది.

ఆటో, మెటల్​, బ్యాంకింగ్​ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

సెన్సెక్స్​ 2.47 శాతం , నిప్టీ 2.52 శాతం మేర నష్టపోయాయి.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఒక్క టీసీఎస్​ మాత్రమే లాభాల్లో ఉంది.

09:37 February 14

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ సన్నాహాలు మదుపరులను కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను ఏ స్థాయిలో, ఎప్పుడు పెంచుతారనే అంశాలపై కూడా మదుపరులు దృష్టి సారించారు. దీంతో అన్నీ రంగాల సూచీలు ప్రతికూలంగా కదిలాడుతున్నాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1,344 పాయింట్లకుపైగా నష్టంతో.. 56,808 వద్ద కదలాడుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 403 పాయింట్లు కోల్పోయి.. 16,971 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​, నిప్టీలు ఏకంగా రెండు శాతం మేర నష్టపోయాయి.

09:05 February 14

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock Market Live News Updates: స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1,344 పాయింట్లకుపైగా నష్టంతో.. 56,808 వద్ద కదలాడుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 391 పాయింట్లు కోల్పోయి.. 16,982 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో టీసీఎస్​ మినహా అన్నీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Feb 14, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.