దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికాలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో సూచీలు కుప్పకూలాయి. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 771 పాయింట్లు కోల్పోయింది. చివరకు 58,152 వద్ద స్థిరపడింది.
అటు, నిఫ్టీ సైతం భారీగా పతనమైంది. 231 పాయింట్లు నష్టపోయింది. చివరకు 17,374 వద్ద ముగిసింది.