స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,708 పాయింట్లు కోల్పోయి.. 47,883 వద్ద ముగించింది. నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయి 14,310 వద్ద స్థిరపడింది.
లాభనష్టాలు..
30 షేర్ల ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ మాత్రమే లాభాలను గడించింది. ఈ సంస్థ షేరు విలువ ఈ ఒక్కరోజే దాదాపు 5 శాతం మేర పెరిగింది. భారత్‌లో స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు తెలియడం, ఆ టీకాను డాక్టర్ రెడ్డీస్ తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం.
దాదాపు అన్నీ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 8.60 శాతం క్షీణించింది.