దేశీయ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో ఉదయం అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీలు.. ఒకానొక సమయంలో కొంత కోలుకున్నప్పటికీ.. చివరకు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఆటో, లోహ, బ్యాంకు, ఫార్మా రంగాల షేర్లు 1-2 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 179 పాయింట్లు నష్టపోయి 52,323 ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో 15,691 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,523 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 52,040 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 15,769 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 15,616 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి షేర్లు..
టీసీఎస్, రిలయన్స్, టెక్మహేంద్రా, అల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్స్ లాభాలను గడించాయి.
అదానీపోర్ట్స్, హిందాల్కో, ఇండస్బ్యాంక్, కోల్ఇండియా, ఐషర్ మోటర్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.