ఒడుదొడుకుల సెషన్‌ను (మంగళవారం) చివరకు ఫ్లాట్‌గా ముగించాయి స్టాక్ మార్కెట్లు (Stocks Today). బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 17 పాయింట్లు తగ్గి 58,279 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద ముగిసింది.
వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,553 పాయింట్ల అత్యధిక స్థాయి (నూతన రికార్డు), 58,005 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,436 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 17,287 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐఆర్సీటీసీ షేర్లు 9.5 శాతానికిపైగా బలపడింది. దీనితో షేరు విలువ రూ.3,300లకు చేరువైంది. భారీ లాభంతో సంస్థ మార్కెట్ విలువ రూ.52,700 కోట్లపైకి చేరింది.
30 షేర్ల ఇండెక్స్‌లో ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధానంగా లాభపడ్డాయి.
టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్ భారీగా ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్) భారీగా, హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు మంగళవారం లాభాలను గడించాయి. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.
ఇదీ చదవండి: భారత్‌తో కెయిర్న్ రాజీ- బిలియన్ డాలర్లు ఇస్తే కేసులు వాపస్!