ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 21 పాయింట్ల లాభంతో 52,344కు చేరగా.. నిఫ్టీ 15,683 వద్ద ముగిసింది.

stock market live today, sensex updates
ఫ్లాట్​గా ముగిసిన స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jun 18, 2021, 3:45 PM IST

ఒడుదొడుకుల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 52,344 వద్ద స్థిరపడింది, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,683కు చేరింది. లోహ, ఆటో, ఐటీ, బ్యాంకు రంగ షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొగా.. ఫార్మా, ఎఫ్ఎమ్సీజీ షేర్ల కొనుగోలుకు మదుపరులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆద్యంతం నష్టోల్లోనే ఉన్న సూచీలు.. తేరుకుని లాభాల్లోకి వచ్చాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,586 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 51,601 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,761 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 15,450 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

అదానీపోర్ట్స్​, గ్రాసిమ్​, హిందుస్థాన్​ యూనిలివర్​, భారతీఎయిర్టెల్​​, బజాజ్​ ఆటో లాభాలు గడించాయి.

ఓఎన్​జీసీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్, కోల్​ఇండియా, యూపీఎల్​, ఎన్​టీపీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.