Stock Market closing: స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్లో భారీ లాభాలు నమోదు చేశాయి. హెవీవెయిట్ షేర్ల దన్నుతో సూచీలు దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1,223 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 54,647 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.
నిఫ్టీ సైతం భారీగా లాభపడింది. 332 పాయింట్లు ఎగబాకి.. 16,344 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ షేర్లలో రిలయన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ట్విన్ షేర్లు దుమ్మురేపాయి. ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు రాణించాయి. లోహ షేర్లు పతనమయ్యాయి.
అంతర్జాతీయంగా మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలు స్టాక్ మార్కెట్లను నడిపించాయి. నాటోలో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనతో.. రష్యా తన దూకుడును తగ్గించుకునే అవకాశం ఉందన్న అంచనాలతో మదుపర్లలో సానుకూలత ఏర్పడింది. అదే సమయంలో వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ కఠిన వైఖరి అవలంబించదన్న విశ్లేషణలూ మార్కెట్కు ప్లస్ అయింది.
ఇదీ చదవండి: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం