Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో.. తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 58 వేల 645 వద్దకు చేరింది.
దాదాపు 150కిపైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 300పాయింట్లకుపైగా కోల్పోయి.. 58 వేల 447 వద్ద సెషన్ కనిష్ఠాన్ని చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 44 పాయింట్ల పతనంతో 17 వేల 516 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పవనాలు.. దేశీయ సూచీలను దెబ్బకొట్టాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్ వంటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, రియాల్టీ రంగం షేర్లు 1-2 శాతం మేర పడిపోయాయి. లోహ రంగం షేర్లలో మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు అన్నీ నష్టాలే నమోదుచేశాయి.
లాభనష్టాల్లో ఇవే..
హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ రాణించాయి.
ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి: అవసరానికి అక్కరకు వచ్చే 'డెట్' పథకాలు