ETV Bharat / business

Stock Market: తీవ్ర ఒడుదొడుకుల సెషన్​లో చివరకు లాభాలు - STOCK MARKET UPDATE

Stock Market Closing: తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్​ 85, నిఫ్టీ 45 పాయింట్లు పెరిగాయి.

STOCKS CLOSING
STOCKS CLOSING
author img

By

Published : Jan 13, 2022, 3:39 PM IST

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్​లో లాభాలను నమోదుచేశాయి. ఆరంభంలో నష్టాలతో ట్రేడయినా.. చివరకు కోలుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 85 పాయింట్లు పెరిగి.. 61 వేల 235 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ మళ్లీ పుంజుకుంది. 60 వేల 950 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ 200 పాయింట్లు పెరిగి 61 వేల 349 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో.. 18 వేల 258 వద్ద సెషన్​ను ముగించింది.

లోహ రంగం షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్​ రంగం షేర్లు పతనం అయ్యాయి.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ అత్యధికంగా దాదాపు 5 శాతం మేర లాభపడ్డాయి. కోల్​ ఇండియా, సన్​ ఫార్మా, దివిస్​ ల్యాబ్స్​, యూపీఎల్​ కూడా రాణించాయి.

విప్రో, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కోటక్​ మహీంద్రా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ​- టీసీఎస్​ భారీ బైబ్యాక్​ ఆఫర్​

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాను ప్రభుత్వం నడుపుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.