Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగి.. చివరకు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి.. 57,420 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్-నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెంది.. 17,086 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు తప్పవన్న భయాల నడుమ ఉదయం 56,948 వద్ద 575 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది సెన్సెక్స్. ఇంట్రాడేలో 56,543 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కాసేపటికే పుంజుకుని.. 57,512 వద్ద గరిష్ఠస్థాయికి చేరింది.
నిఫ్టీ.. ఇంట్రాడేలో 16,833 వద్ద అత్యల్పస్థాయికి చేరి.. తిరిగి పుంజుకుని 17,112 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
లాభనష్ఠాలు
- టెక్‌మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, కొటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ షేర్లు ఎక్కువగా లాభాలు గడించాయి.
- ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతి, రిలయన్స్, భారతీఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఆ డౌట్స్‌తో ఆర్బీఎల్ షేర్లు పతనం.. భయం వద్దని ఆర్బీఐ భరోసా