Stock Market Closing: అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 929 పాయింట్లు లాభపడి 59వేల 183వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 271పాయింట్ల లాభపడి 17వేల 625 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
58,487 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఉదయం నుంచి చివర వరకు లాభాల్లో కొనసాగింది. కీలక రంగాల్లో మద్దతుతో 929 పాయింట్లకు పైగా పుంజుకుని 59,183 పాయింట్ల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోని ఇవే..
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో టెక్‌మహీంద్రా, ఎం&ఎం, డాక్టర్.రెడ్డీ, నెస్లే ఇండియా.. తప్ప మిగతావన్నీ లాభాలను నమోదుచేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. హాంకాంగ్, యూరోపియన్ సూచీలు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అమెరికా సూచీ నాస్డాక్ నష్టాలను నమోదు చేసింది.
లాభాలకు కారణాలివే..
- అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు.
- విదేశీ మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లుకు దిగడం కారణంగా సూచీలు భారీ లాభాల దిశగా అడుగులు వేశాయి.
- కొత్త ఏడాది సెంటిమెంట్ కూడా మదుపరులను కొనుగోళ్లు చేసేలా ప్రోత్సహించింది.
- బడ్జెట్ ముందస్తు సమావేశాలు, మూడో త్రైమాసిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలపై మదుపర్లు దృష్టి సారించారు.