స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల జోరు కొనసాగింది. ముఖ్యంగా ఇంధన రంగ షేర్ల దన్నుతో ఆరంభ నష్టాల నుంచి మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న వార్తలతో వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం సెషన్లో రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒకానొక దశలో బీఎస్ఈలో దాదాపు 30 శాతం లాభంతో ట్రేడయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 223.51 పాయింట్ల వృద్ధితో 32,424 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 90.20 పాయింట్లు లాభపడి..9,580 వద్ద ముగిసింది.
లాభాల్లో...
ఐఓసీ, కోల్ఇండియా, ఓఎన్జీసీ, విప్రో, గెయిల్, ఐఎఫ్సీఐ, ఐడియా, సింఫనీ. ప్రెస్టేజ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
నష్టాల్లో...
ఆదానీపోర్ట్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, భారతీఎయిర్‌టెల్ షేర్లు నష్టాలబాట పట్టాయి.
రూపాయి...
14 పైసలు పుంజుకున్నరూపాయి... డాలర్‌తో పోలిస్తే 75.62 వద్ద స్థిరపడింది.