అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డా... దేశీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా పెరిగి 39 వేల 40 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 11 వేల 630 వద్ద ట్రేడవుతోంది.
బ్యాంకింగ్ రంగాల వాటాల కొనుగోలుకు మదుపర్లు అమితాసక్తి చూపుతున్నారు.
ఇవీ కారణాలు...
* దిగ్గజ ఐటీ సంస్థలు తొలి త్రైమాసికంలో సంతృప్తికర స్థాయిలో లాభాలు ఆర్జించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.
* టోకు ధరల ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠ స్థాయికి దిగిరావడం దేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై మదుపర్లలో భరోసా పెంచింది.
లాభనష్టాల్లో...
టాటా మోటర్స్, వేదాంత, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ 1.65 శాతం వరకు లాభపడ్డాయి.
టీసీఎస్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, కోల్కతా బ్యాంక్ 1.62 శాతం వరకు నష్టపోయాయి.
రూపాయి... ముడిచమురు...
డాలరుతో పోల్చితే రూపాయి 68.55 వద్ద ఫ్లాట్గా ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.12శాతం పెరిగి బ్యారెల్కు 66.56 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:రెండేళ్ల కనిష్ఠానికి టోకు ధరల సూచీ