గత కొద్ది రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం భారీ లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 568 పాయింట్లు బలపడి 49,008 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 182 పాయింట్లకు పైగా పెరిగి 14,507 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,235 అత్యధిక స్థాయిని; 48,700 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 14,573 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,414 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో.. పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్ తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: పన్ను ఆదాకు.. ఫండ్ల మార్గం..