వరుస నష్టాలకు బ్రేకులు వేస్తూ.. స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 280 పాయింట్లు బలపడి.. 50,051 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,814 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నా... ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలోపేతం లాభాలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,264 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,662 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,879 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,707 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో ఉన్న షేర్లు..
- అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, షేర్లు భారీగా లాభాపడ్డాయి.
- ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, షేర్లు నష్టపోయాయి.
ఇదీ చదవండి: భారత్ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!