స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 300 పాయింట్లు కోల్పోయి 55,329 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 118 పాయింట్ల నష్టంతో 16,450 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేశాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. దీంతో ఆసియా సూచీలు కలవరపాటుకు గురయ్యాయి. దీనికి తోడు సూచీలు గరిష్ఠాల సమీపంలో ఉన్న నేపథ్యంలో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఒకానొక దశలో భారీనష్టాల దిశగా అడుగులు వేశాయి. మిడ్ సెషన్లో కొంతమేర కోలుకున్న మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 55,543 పాయింట్ల అత్యధిక స్థాయిని, 55,014 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 16,509 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,376 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాలు..
హిందుస్థాన్ యూనీలివర్, ఏసియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
టాటా స్టీల్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డి, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చూడండి: బంగారానికి ఎందుకంత డిమాండ్? ధర ఎవరు నిర్ణయిస్తారు?