అంతర్జాతీయ సానుకూలతలు, లోహం, చమురు, బ్యాంకింగ్ రంగం షేర్ల దూకుడుతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి . సెన్సెక్స్ 200 పాయింట్లు వృద్ధి చెంది 38,885 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 11,658 వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో పరిగెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నాలుగు వారాల్లో ఈ విషయమై కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన మదుపర్లలో ఉత్సాహం నింపింది.
లాభాల్లోనివివే...
ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వేదాంత, ఎమ్ అండ్ ఎమ్, ఐసీసీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లోనివివే...
ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, మారుతి, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి..
మార్కెట్ ఆరంభంలో రూపాయి విలువ 10 పైసలు మెరుగుపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.69.07గా ఉంది.
చమురు..
చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ ధర 69.22 డాలర్లకు చేరింది.
- ఇదీ చూడండి: ట్రాక్టర్ల ఉత్పత్తిలో స్వరాజ్ కీలక మైలురాయి