గత వారాంతంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల బాట పట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ షేర్ల కొనుగోలుకు అంతర్జాతీయ మదుపరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో గరిష్ఠంగా 785 పాయింట్లను తాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 565 పాయింట్ల వృద్ధితో 38, 862 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 11, 360 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఓఎన్జీసీ, టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బలపడిన రూపాయి
డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు బలపడి 72.09 గా ఉంది.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: జీవిత బీమా క్లెయిం చేసుకోవడం ఎలానో తెలుసా?