ETV Bharat / business

భారీ లాభాలు ఆర్జించిన స్టాక్​మార్కెట్లు - జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ

అంతర్జాతీయ సానుకూల పవనాలు, ముడి చమురు ధరల తగ్గుదలతో బుధవారం స్టాక్​మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి.

భారీ లాభాలు ఆర్జించిన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Apr 24, 2019, 4:46 PM IST

గత మూడు సెషన్ల వరుస నష్టాల తరువాత బుధవారం స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలు రావడం, ముడి చమురు ధరల తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 489.80 పాయింట్లు (1.27 శాతం) లాభపడి 38 వేల 095.35 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 150.20 పాయింట్లు (1.30 శాతం) వృద్ధిచెంది 11 వేల 740.85 వద్ద స్థిరపడింది.

లాభాల్లో

హెచ్​సీఎల్​, ఓఎన్​జీసీ సుమారు 3.40 శాతం వరకు లాభపడ్డాయి. ఇండస్​ఇండ్​ బ్యాంకు, యెస్​ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఆర్​ఐఎల్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎస్బీఐ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ సుమారు 2.75 శాతం లాభాలను ఆర్జించాయి.

నష్టాల్లో

టాటా మోటార్స్, హీరో మోటాకార్ప్​, కోల్​ ఇండియా, పవర్​గ్రిడ్​, మారుతీ, యాక్సిస్ బ్యాంకు, ఎన్టీపీసీ సుమారు 3.33 శాతం వరకు నష్టపోయాయి.

0.08 శాతం తగ్గిన చమురు ధర

అంతర్జాతీయంగా ముడిచమురు ధర 0.08 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ ధర 74.45 డాలర్లుగా ఉంది.

క్షీణించిన రూపాయి విలువ

రూపాయి విలువ 21 పైసలు క్షీణించి, ప్రస్తుతం ఒక అమెరికా డాలర్​కు రూ.69.83లుగా ఉంది.

ఇదీ చూడండి: వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై రివ్యూ పిటిషన్​

Kolkata, Apr 16 (ANI): After meeting with Election Commission (EC) Bharatiya Janata Party (BJP) leader Jay Prakash Majumdar on Bangladeshi actor Ferdous's campaign for TMC said said, "We understand that foreign nationals can't participate in electioneering process in India. When TMC is using Bangladeshi nationals (actor Ferdous) for campaigning, they are breaking the rules. He should be arrested for breach of visa rules."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.