ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్ర మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వార్షిక ఏడాదిని భారీ నష్టాలతో ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,203 పాయింట్ల నష్టంతో 28,265 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 343 పాయింట్లు క్షీణించి.. 8,253 వద్ద ముగిసింది.
కరోనా భయాలు మదుపరులను కలవరపాటుకు గురిచేశాయి. కొవిడ్-19 కారణంగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటామన్న వార్తలు సూచీలను మరింత పతనం దిశగా నడిపించాయి.
లాభాల్లో..
హెచ్ఎస్సీఎల్, ఇన్ఫీబీమ్, కేఆర్‌బీఎల్, సుప్రజిత్, బజాజ్ ఆటో షేర్లు లాభాలతో ముగించాయి.
నష్టాల్లో...
కొటక్ బ్యాంక్ షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. ఎమ్ అండ్ ఎమ్, హెచ్‌సీఎల్‌టెక్, జిందాస్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.