స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి (stock market news). బీఎస్ఈ-సెన్సెక్స్ (bse sensex today live ) 32 పాయింట్లు పెరిగి 60,719 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ (nifty today live ) 7 పాయింట్లు కోల్పోయి 18,109 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సూచీలు మొదట లాభాలతో ప్రారంభమయ్యాయి. తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్లో తిరిగి పుంజుకున్న మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 61,036 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,597 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,210 పాయింట్ల గరిష్ఠ స్థాయి 18,071 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
పవర్ గ్రిడ్, ఐటీసీ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర, టీసీఎస్ షేర్లు లాభాలను గడించాయి.
టాటా స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.