స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 50పాయింట్లకుపైగా పెరిగి 39వేల 110 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 30పాయింట్ల లాభంతో 11వేల 750 వద్ద ట్రేడవుతోంది.
విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. అయితే.. ఏప్రిల్ డెరివేటివ్‌ల కాంట్రాక్టు ముగింపునకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండగా... లాభాలు పరిమితంగా ఉన్నాయి.
లాభాల్లో...
ఎస్ బ్యాంకు, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ డ్యుయో, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్ (సుమారు 2.78 శాతం) లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో...
మారుతీ, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, వేదాంత, కోటక్ బ్యాంకు, ఆర్ఐఎల్ (సుమారు 0.83 శాతం) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లైన షాంగై, టోక్యో, సియోల్ ఈక్విటీ సూచీలు మిశ్రమ ఫలితాలను చూశాయి. వాల్‌స్ట్రీట్, డౌజోన్స్ ఇండస్ట్రియల్ బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ముడిచమురు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.03 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 74.59 అమెరికన్ డాలర్లుగా ఉంది.
క్షీణించిన రూపాయి విలువ
రూపాయి విలువ 17 పైసలు క్షీణించింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్‌కు రూ.70.04 లుగా ఉంది.
ఇదీ చూడండి: ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌లు ఇక ప్రభుత్వానిదే!