ETV Bharat / business

వారాంతంలోనూ బుల్​ జోరు- 50,700పైకి సెన్సెక్స్​ - స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 50,700 పైకి చేరింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 14 వేల 900 మార్క్ దాటింది.

SENSEX
వారంతంలో బుల్​ జోరు
author img

By

Published : Feb 5, 2021, 3:53 PM IST

స్టాక్​ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. వరుస లాభాలతో మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. శుక్రవారం సెషన్​లో బీఎస్​ఈ సూచీ-సెన్సెక్స్ 117 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 50,731 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్ఈ-నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 14,924 వద్దకు చేరింది.

అంతర్జాతీయ సానుకూలతలకు తోడు బడ్జెట్​ ఉత్సాహం​ లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫార్మా రంగం షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,073 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 50,565 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,014 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు ), 14,864 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​బీఐఎన్, ఐటీసీ, పవర్​గ్రిడ్, బజాజ్​ఫినాస్స్, ఎన్​టీపీసీ, టాటాస్టీల్​, కోటక్​ బ్యాంక్, దివీస్​ ల్యాబ్ షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.

టైటాన్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఏషియన్​ పెయింట్, భారతీఎయిర్​టెల్, టాటామోటర్స్, యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ ఆటో షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

షాంఘై తప్ప ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు టోక్యో, కోస్పీ, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.