స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 42 పాయింట్లు బలపడి 49,201 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద ముగిసింది.
ఆరంభం నుంచి ఒడుదొడుల్లో కొనసాగినా సూచీలు చివరకు లాభాల్లో ముగియటం గమనార్హం. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 49,582 పాయింట్ల అత్యధిక స్థాయి: 48,936 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,779 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,573 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎం&ఎం లాభాలను నమోదు చేశాయి.
పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ నష్టాలను నమోదు చేశాయి. కోస్పీ సూచీ మాత్రం స్వల్పంగా లాభపడింది.
ఇదీ చదవండి:మూడు నెలల్లో 44% పెరిగిన ఇళ్ల విక్రయాలు