కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిన కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ (సెన్సెక్స్) రికార్డు స్థాయిలో 600 పాయింట్లకుపైగా పడిపోయింది. ఈ ఏడాది ఒక్కరోజులో అతిపెద్ద పతనం ఇదే.
ప్రస్తుతం సెన్సెక్స్ 38,910 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 11,620 వద్ద ట్రేడవుతోంది.
పీఎన్బీ ప్రభావం
బడ్జెట్‌కు తోడుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో భూషన్ పవర్, స్టీల్ సంస్థ రూ.3,800 కోట్ల అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం కుదేలయింది. ఈ బ్యాంకు 11 శాతం షేర్లు నష్టపోయింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 5 శాతం మేర నష్టపోయాయి.
బజాజ్ ఫైనాన్స్, ఐఓసీ, ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్, ఎస్బీఐ 4.5 శాతం మేర పతనమయ్యాయి.
ఇదీ చూడండి: ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో భారీ నష్టాలు