ఆరంభంలో లాభాలతో ఊరించిన స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 244 పాయింట్లు తగ్గి 47,705 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 14,296 వద్ద స్థిరపడింది.
ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు వివిధ రాష్ట్రాలు విధిస్తున్న కఠిన ఆంక్షలు మదుపరుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపడం అమ్మకాలకు దారి తీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,478 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,438 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,527 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,207 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, ఎం&ఎం, మారుతీ సుజుకీ షేర్లు లాభాలను గడించాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలు నమోదు చేశాయి. షాంఘై, టోక్యో సూచీలు నష్టాలతో ముగిశాయి.