దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్1,066 పాయింట్లు పతనమై 39,728 పాయింట్లకు పడిపోయింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 291 పాయింట్లు క్షీణించి 11,680 పాయింట్లకు చేరింది.
గత పది రోజుల వచ్చిన లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
లాభనష్టాల్లో...
ఏషియన్ పెయింట్స్ మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి.
రూపాయి మారకం..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి డాలరుతో పోలిస్తే 73.36 వద్ద స్థిరపడింది.
చమురు..
బ్రెంట్ క్రూడ్ ధర 1.27 శాతం పడిపోయి బ్యారెల్కు 42.77 డాలర్లకు చేరింది.