బడ్జెట్‌తో గత వారం కుదేలయిన మార్కెట్లు ఈ వారం మొదటి రోజున స్వల్ప లాభాలతో ముగిశాయి. 160 పాయింట్లు లాభపడిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 38,896 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 11,588 వద్ద ముగిసింది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తొలి త్రైమాసికంలో 7.2 శాతం లాభాలు సాధించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండడమూ లాభాలకు దోహదం చేసింది.
లాభాలు-నష్టాలు
టీసీఎస్, సన్‌ఫార్మా, టెక్‌మహీంద్రా, మారుతి, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ 3.61 శాతం మేర పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ, హీరోమోటోకార్ప్ 2.28 శాతం మేర నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్‌కాంగ్, జపాన్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
23 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం జూన్‌లో 2.02 శాతంతో 23 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.98శాతంగా నమోదైంది. కూరగాయల ద్రవ్యోల్బణం 24.76 శాతానికి పడిపోయింది(మే నెలలో 33.15 శాతం).
17 పైసలు బలపడిన రూపాయి..
అమెరికా డాలరుతో పోలిస్తే 68.52 వద్ద స్థిరపడింది.
ముడిచమురు ధర 0.42 శాతం పెరిగి బ్యారెల్‌కు 67 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: రెండేళ్ల గరిష్ఠానికి టోకు ధరల సూచీ