వరుసగా రెండో సెషన్లోనూ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. చైనాను బెంబేలెత్తిస్తోన్న కరోనా కారణంగానే మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆరంభంలో లాభాల్లో కొనసాగినా.. కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమై.. 40 వేల 967 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయింది. చివరకు 12 వేల 56 వద్ద ముగిసింది.
ఐటీ మినహా బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా, స్థిరాస్తి, లోహ రంగం షేర్లన్నీ కుదేలయ్యాయి.
ఇవాళ్టి ట్రేడింగ్‌లో మొత్తం 985 షేర్లు రాణించాయి. 1511 షేర్లు క్షీణించాయి. 165 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
లాభనష్టాల్లోనివి...
వేదాంత, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డీలాపడ్డాయి.
బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ లాభాలను గడించాయి.
అంతర్జాతీయ మార్కెట్లు...
కరోనా ప్రభావం ఆసియా మార్కెట్లపై అధికంగా ఉంది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 3 శాతానికి పైగా కోల్పోయింది. జపాన్ నిక్కీ కూడా నష్టాలను నమోదు చేసింది.
బ్యారెల్ ముడిచమురు ధర 0.77 శాతం తగ్గి 58.13 డాలర్ల వద్ద స్థిరపడింది.
రూపాయి...
రూపాయి కాస్త పుంజుకుంది. ఇంట్రాడేలో 12 పైసలు వృద్ధి చెందింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ.. ప్రస్తుతం 71.31 వద్ద ఉంది.